Breaking News

ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న మహిళా పోలీసులు..


Published on: 23 Sep 2025 12:05  IST

ఉత్తర ప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా మహిళా పోలీసులు ఎన్‌కౌంటర్‌లో పాల్గొని ఓ హిస్టరీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లోహియా నగర్‌లో పాట్రోలింగ్ చేస్తుండగా జితేంద్ర కుమార్ అనే రౌడీషీటర్‌ స్కూటీపై తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు అడ్డుకోవడంతో తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ నేపథ్యంలోనే మహిళా పోలీసులు ప్రతిఘటించి కాల్పులు చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో జితేంద్ర కాలికి గాయం కావడంతో పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి స్కూటీ, పిస్టల్‌, మొబైల్‌, ట్యాబ్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి