Breaking News

ఒంగోలులో భూకంపం తరహా ప్రకంపనలు – ప్రజల్లో ఆందోళన

ఒంగోలులో భూకంపం తరహా ప్రకంపనలు – ప్రజల్లో ఆందోళన


Published on: 24 Sep 2025 09:18  IST

ఒంగోలు నగరంలో అర్ధరాత్రి అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రాత్రి 2:53 గంటలకు రెండు సెకండ్లపాటు స్పష్టంగా ప్రకంపనలు అనిపించాయి. ముఖ్యంగా భాగ్యనగర్, శర్మా కాలనీ, దేవుడు చెరువు పరిసరాల్లో భూమి కంపించడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ప్రాంతాలను సందర్శించి, ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

గతంలోనూ ప్రకాశం జిల్లాలో ఇలాంటి స్వల్ప భూకంప తరహా ప్రకంపనలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ప్రకంపనల కారణాలు ఏంటన్న దానిపై అధికారులు మరింత స్పష్టత కోసం పరిశీలనలు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి