Breaking News

లడ్డాఖ్‌లో మొబైల్ ఇంటర్నెట్ బంద్‌..


Published on: 25 Sep 2025 19:03  IST

నిన్నటి హింసాకాండ తర్వాత లడ్డాఖ్‌లోని లేహ్, కార్గిల్ పట్టణాల్లో పోలీసుల నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ప్రజలు ఎక్కడా గుమికూడకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయగా, మరికొన్ని ప్రాంతాలలో అప్‌లోడ్, డౌన్‌లోడ్ వేగాన్ని పరిమితం చేస్తూ చర్యలు చేపట్టారు. ఈరోజు ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి నిరనస ప్రదర్శనలు లేవు. పోలీసులు, భద్రతా బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి