Breaking News

బీసీల‌కు అర‌చేతిలో బెల్లం పెట్టి మోచేతితో..!


Published on: 10 Oct 2025 15:35  IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీల‌కు అర‌చేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకిస్తున్నార‌ని బీఆర్ఎస్ నేత క్యామ మ‌ల్లేష్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కొంద‌రు బీసీ నేత‌లు రేవంత్ రెడ్డి చేతిలో బాడుగ నేత‌లుగా మారార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో క్యామ మ‌ల్లేష్ మీడియాతో మాట్లాడారు.కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. 42 శాతం రిజర్వేషన్లపై సాంకేతిక అంశాలను రేవంత్ రెడ్డి కావాలనే విస్మరించి బీసీల పట్ల దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించారు.

Follow us on , &

ఇవీ చదవండి