Breaking News

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ..


Published on: 13 Oct 2025 15:33  IST

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇవాళ(సోమవారం) ఉదయం 11 గంటలు నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 21 వరకు నామినేషన్లకు గడువు ఉండనున్నట్లు పేర్కొన్నారు. షేక్‌‌పేట్ ఎమ్మార్వో ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీస్‌లో నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని వివరించారు. అలాగే.. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 24 వరకు అధికారులు అవకాశం కల్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి