Breaking News

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ముహూర్తం ఖరారు.

తెలంగాణలో 2026 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి చివరి వారం నుంచి మొదలయ్యే అవకాశం ఉంది.


Published on: 14 Oct 2025 12:59  IST

తెలంగాణలో 2026 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి చివరి వారం నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయిప్రవేశ పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన సమయం ఇచ్చే ఉద్దేశంతో ఈ షెడ్యూల్‌ను కాస్త ముందుగానే ఖరారు చేయాలని బోర్డు భావిస్తోంది. దీనిపై అధికారిక షెడ్యూల్ డిసెంబర్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది.

గతంలో మార్చి నెలలో పరీక్షలు మొదలయ్యేవి. కానీ ఈసారి ఫిబ్రవరి చివరి నుంచే పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు యోచిస్తోంది.ప్రతిపాదన పంపిన బోర్డు ఫిబ్రవరి 23 లేదా 25నుంచి పరీక్షలు ప్రారంభమయ్యేలా రెండు రకాల టైమ్ టేబుళ్లను బోర్డు ప్రభుత్వానికి పంపింది. అధికారిక ప్రకటన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఆమోదం తర్వాతే తుది షెడ్యూల్ విడుదలవుతుంది.ఫీజు పెంపు ప్రతిపాదన పరీక్షల ఫీజును పెంచాలని కూడా ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పరీక్షల టైమ్ టేబుల్‌పై అధికారిక ప్రకటన కోసం విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

ఫిబ్రవరి చివరి వారం (27వ తేదీ) నుండి మార్చి 13, 2026 మధ్య థియరీ పరీక్షలు జరగవచ్చని అంచనా.ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి నెలలో నిర్వహించే అవకాశం ఉంది. అధికారికటైమ్‌టేబుల్ డిసెంబర్ 2025లో విడుదల కావొచ్చు

Follow us on , &

ఇవీ చదవండి