Breaking News

కవల పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి


Published on: 14 Oct 2025 17:17  IST

సాయిలక్ష్మీ (27)కి అనిల్‌ కుమార్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత హైదరాబాద్‌ పద్మారావు నగర్‌ ఫేజ్‌ 1లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు  కవల పిల్లలు చేతన్‌ కార్తికేయ, లాస్యత వల్లి ఉన్నారు.కొంతకాలంగా స్పీచ్‌థెరపీ ఇప్పిస్తున్నారు. పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి గొడవ జరగడంతో మనస్తాపం చెందిన సాయిలక్ష్మీ బలవన్మరణానికి పాల్పడింది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపేసింది.

Follow us on , &

ఇవీ చదవండి