Breaking News

దీపావళి సందర్భంగా బీఎస్ఎన్ఎల్ రూ. 1 రీఛార్జ్ ఆఫర్


Published on: 15 Oct 2025 16:26  IST

బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి సందర్భంగా కొత్త కస్టమర్ల కోసం ఒక ప్రత్యేకమైన రూ. 1 ఆఫర్‌ను ప్రకటించింది. బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి బంపర్ ఆఫర్  రూ. 1 తో రీఛార్జ్ చేసుకుంటే కొత్త కస్టమర్లకు ఈ కింది ప్రయోజనాలు లభిస్తాయి అపరిమిత వాయిస్ ,ప్రతిరోజు 2GB డేటా ,ప్రతిరోజు 100 SMSలు ,ఉచిత సిమ్ కార్డు లభిస్తాయి.

ఈ ఆఫర్ కింద లభించే ప్రయోజనాలకు 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.ఈ ఆఫర్ 2025 అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. కొత్త కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌లోకి కొత్తగా వచ్చే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.ఫ్రీడమ్ ప్లాన్ పొడిగింపు ఈ ఆఫర్ గతంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రారంభించిన 'ఫ్రీడమ్ ప్లాన్'ను పొడిగించబడిన వెర్షన్. 

Follow us on , &

ఇవీ చదవండి