Breaking News

బంద్‌కు ప్రధాన కారణం బీజేపీనే:డిప్యూటీ సీఎం భట్టి


Published on: 17 Oct 2025 14:40  IST

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం దేశంలోనే తొలి ప్రయత్నమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కులగణన ఆధారంగా సైంటిఫిక్‌గా రిజర్వేషన్లు నిర్ణయించామని, చట్టసభల్లో ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్, రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. అయితే కేంద్రం ఆమోదం ఇవ్వకుండా బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటోందని ఆరోపించారు. ఇది బీజేపీ నిరంకుశ పాలనకు నిదర్శనమని భట్టి విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి