Breaking News

ములుగు జిల్లాలో లొంగిపోయిన మావోయిస్టులు

ములుగు జిల్లాలో అక్టోబర్ 21, 2025న నలుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.


Published on: 21 Oct 2025 18:26  IST

ములుగు జిల్లాలో అక్టోబర్ 21, 2025న నలుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ సమక్షంలో వీరు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు మాడవి కోసి, మాడవి ఇడుమే ,మచ్చకి దేవా ,మడకం బండి .లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ. 25,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని ఎస్పీ అందించారు.మావోయిస్టులు సాధారణ జీవితాన్ని గడపడానికి, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులయ్యారని ఎస్పీ తెలిపారు.లొంగిపోవాలనుకునే మావోయిస్టులు నేరుగా పోలీసులను సంప్రదించవచ్చని, వారికి ఎలాంటి హాని జరగదని ఎస్పీ భరోసా ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి