Breaking News

బలహీనపడనున్న అల్పపీడనం..


Published on: 23 Oct 2025 11:02  IST

పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం అంటే.. ఈ రోజు బలహీనపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక కర్నూలు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పారు. భారీ వర్షాలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి