Breaking News

పోచారం ఐటీ కారిడార్‌లో కాల్పుల

అక్టోబర్ 23, 2025న పోచారం ఐటీ కారిడార్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రశాంత్ అలియాస్ సోను సింగ్ అనే గో సంరక్షకుడు గాయపడ్డారు.


Published on: 23 Oct 2025 11:32  IST

అక్టోబర్ 23, 2025న పోచారం ఐటీ కారిడార్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రశాంత్ అలియాస్ సోను సింగ్ అనే గో సంరక్షకుడు గాయపడ్డారు. పశువులను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న సోను సింగ్, ఘట్‌కేసర్‌లోని యానంపేట వద్ద ఓ వాహనాన్ని అడ్డగించారు.అనంతరం, ఇబ్రహీం అనే పశువుల వ్యాపారితో జరిగిన వాగ్వాదంలో ఇబ్రహీం కాల్పులు జరిపారు.ఒక బుల్లెట్ సోను సింగ్ పక్కటెముకల్లోకి దూసుకుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ప్రధాన నిందితుడు ఇబ్రహీంతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.బుల్లెట్ ఇంకా సోను సింగ్ శరీరంలోనే ఉందని, ఆపరేషన్ చేయడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. 

ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. గో సంరక్షకుడిపై జరిగిన దాడిని ఖండించింది.బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ ఆసుపత్రికి వెళ్లి సోను సింగ్‌ను పరామర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని బీజేపీ ఆరోపించింది.బీజేపీ నాయకులు, కార్యకర్తలు డీజీపీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి