Breaking News

BELలో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు.. అప్లికేషన్లకు నవంబర్ 5 లాస్ట్ డేట్

BELలో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు.. అప్లికేషన్లకు నవంబర్ 5 లాస్ట్ డేట్


Published on: 24 Oct 2025 16:04  IST

భారత ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ట్రైనీ ఇంజనీర్-I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 47 ఖాళీలకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ నవంబర్ 5.

 అర్హతలు:
ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్ తదితర విభాగాల్లో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటેక్ లేదా ఎంసీఏ పూర్తిచేసి ఉండాలి.

 వయస్సు పరిమితి:
గరిష్ఠంగా 28 సంవత్సరాలు, అయితే రిజర్వు వర్గాలకు సడలింపు ఉంటుంది.

 అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు, ఇతరులకు రూ.150 మాత్రమే.

 ఎంపిక విధానం:
అభ్యర్థులను షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

 ముఖ్య తేదీలు:

  • అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 21

  • చివరి తేదీ: నవంబర్ 5

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ bel-india.in చూడవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి