Breaking News

చంద్రగిరిలో ఏనుగుల గుంపు బీభత్సం

అక్టోబర్ 27, 2025న తిరుపతి జిల్లాలోనిచంద్రగిరి,మండలం భీమవరం,ఎల్లంపల్లి గ్రామాలలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది.


Published on: 27 Oct 2025 14:15  IST

అక్టోబర్ 27, 2025న తిరుపతి జిల్లాలోనిచంద్రగిరి,మండలం భీమవరం,ఎల్లంపల్లి గ్రామాలలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. రాత్రిపూట ఏనుగులు పొలాల్లోకి ప్రవేశించి అరటి, వరి పంటలు, టేకు చెట్లను, పొలాల చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌లను ధ్వంసం చేశాయి. 

గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు తిరుగుతోందని గ్రామస్థులు తెలిపారు.ఏనుగుల సంచారం వల్ల భయాందోళనలకు గురైన గ్రామస్థులు బయటకు వెళ్లడానికి లేదా పొలాలకు వెళ్లడానికి భయపడుతున్నారు.సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఏనుగులను తిరిగి అడవిలోకి పంపించేందుకు చర్యలు చేపట్టారు.ఏనుగుల కదలికలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి, ఏనుగులను అడవిలోకి శాశ్వతంగా పంపించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, రైతులు అటవీ అధికారులను కోరుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి