Breaking News

7 జిల్లాలపై పంజా


Published on: 29 Oct 2025 11:37  IST

రాష్ట్రంలోని ఏడు తీర ప్రాంత జిల్లాలపై మొంథా తుఫాన్‌ పంజావిసిరింది. ప్రచండ వేగంతో వీచిన పెనుగాలులు, భారీవర్షాలతో బీభత్సం సృష్టించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అప్పటికప్పుడు కుంభవృష్టి పడటం, ఆ తర్వాత పెనుగాలులు విరుచుకుపడడం, మళ్లీ కాసేపటికి ఒక్కసారిగా తీవ్రంగా ఎండ కాయడం.. ఇలా గంటకో రకంగా వాతావరణం మారిపోతూ జనాన్ని హడలెత్తించింది. గతంలో ఏ తుఫాన్‌ సమయంలోనూ లేనంతగా ఉప్పాడ వద్ద సముద్రం విలయ తాండవం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి