Breaking News

ఎలికామ్ నుంచి ప్రపంచంలోనే ఫస్ట్ Na-ion పవర్ బ్యాంక్- 10 రెట్లు ఎక్కువ ఛార్జింగ్ సైకిల్స్​తో

ప్రపంచంలోనే మొట్టమొదటి సోడియం-అయాన్ పవర్ బ్యాంక్​ ఆవిష్కారం- దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే!


Published on: 19 Mar 2025 12:15  IST

ఎలికామ్ ప్రపంచంలోనే మొట్టమొదటి సోడియం-అయాన్ పవర్ బ్యాంక్​ను ఆవిష్కరించింది. ఇది సంప్రదాయ లిథియం-అయాన్ బ్యాటరీ కంటే 10 రెట్లు ఎక్కువ ఛార్జింగ్ సైకిల్స్ కలిగి ఉంటుంది. ఈ మేరకు పేర్కొంటూ కంపెనీ దీనిపై అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేసింది.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. సోడియం-అయాన్ పవర్ బ్యాంక్‌లో 3,000mAh బ్యాటరీ సెల్స్ ఉంటాయి. దీని మొత్తం సామర్థ్యం 9,000mAh. ఇది USB-A, USB-C పోర్ట్‌లతో వస్తుంది. ఇది గరిష్ఠంగా 45 వాట్ల అవుట్‌పుట్‌తో వస్తుంది. ఇక మనకు తెలిసిన, ఉపయోగిస్తున్న సర్వవ్యాప్త లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే.. సోడియం-అయాన్ బ్యాటరీలు అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

సోడియం-అయాన్ బ్యాటరీల ప్రయోజనాలు: సోడియం-అయాన్ బ్యాటరీల గురించి మాట్లాడుకుంటే.. ఇవి పర్యావరణానికి అనుకూలమైనవి. ఎందుకంటే ఇందులో ఉపయోగించే ముఖ్యమైన పదార్థం సోడియం క్లోరైడ్. దీన్ని లిథియం కంటే చాలా ప్రబలంగా, సులభంగా పొందొచ్చు. దీంతోపాటు సోడియం.. లిథియం మాదిరిగా రియాక్టివ్‌ కాకపోవడం వల్ల ఇది సురక్షితమైనదిగా ఉంటుంది.

అంతేకాక సోడియం-అయాన్ బ్యాటరీలు కూడా తక్కువ ఉష్ణోగ్రతలను బాగానే తట్టుకుంటాయి. ఈ కొత్త పవర్ బ్యాంక్ టెక్నాలజీని -35 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్ (లేదా -31 నుంచి 122 ఫారెన్‌హీట్) వరకు ఉష్ణోగ్రతలలో ఉపయోగించొచ్చని కంపెనీ చెబుతోంది.

అయితే దీని ప్రయోజనం ముఖ్యంగా ఛార్జింగ్ సైకిల్స్‌లోనే ఉంటుంది. ఎలెకామ్ ప్రకారం.. సోడియం-అయాన్ పవర్ బ్యాంక్ మొత్తం ఛార్జింగ్ కెపాసిటీలో గణనీయమైన తగ్గుదలను అనుభవించే ముందు 5,000 ఛార్జింగ్ సైకిల్స్ వరకు వెళ్లగలదు. అంటే దాదాపు 5,000 ఛార్జింగ్ సైకిల్స్ వరకు దీని ఛార్జింగ్ కెపాసిటీ తగ్గదు. లిథియం-అయాన్ బ్యాటరీలతో పోల్చితే ఇది రిమార్కబుల్. ఎందుకంటే లిథియం- అయాన్ బ్యాటరీలు దాదాపు 500 కంప్లీట్ ఛార్జింగ్ సైకిల్స్ తర్వాత వాటి మొత్తం ఛార్జింగ్ కెపాసిటీలో 80 శాతం మాత్రమే ఉంచుతాయి. అంటే 500 కంప్లీట్ ఛార్జింగ్ సైకిల్స్ తర్వాత వీటి ఛార్జింగ్ కెపాసిటీ దాదాపు 20 శాతం తగ్గుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి