Breaking News

హైద‌రాబాద్‌లో ప‌లు ప్రాంతాల్లో మోస్త‌రు వ‌ర్షం


Published on: 29 Oct 2025 16:21  IST

హైద‌రాబాద్ న‌గ‌రంలో రాత్రి నుంచి ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురుస్తుంది. తేలికపాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో న‌గ‌ర ప్ర‌జ‌లు వాతావ‌ర‌ణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఉద్యోగాల‌కు వెళ్లాల్సిన ఉద్యోగులు, పాఠ‌శాల‌ల‌కు వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప‌లు చోట్ల ర‌హ‌దారుల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచిపోయింది. దీంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement