Breaking News

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది

అక్టోబర్ 29, 2025న కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.


Published on: 29 Oct 2025 17:00  IST

అక్టోబర్ 29, 2025న కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి, భారత జట్టు 9.4 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 97 పరుగులు చేసింది. 

ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 19 పరుగులకు ఔటయ్యాడు.ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ కలిసి దూకుడుగా ఆడారు. వీరిద్దరూ 35 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.భారత ఇన్నింగ్స్ 9.4 ఓవర్ల వద్ద ఉండగా, మరోసారి భారీ వర్షం పడింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.మ్యాచ్ రద్దయ్యే సమయానికి భారత్ స్కోరు 97/1. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. 

Follow us on , &

ఇవీ చదవండి