Breaking News

పేరుకేమో డాక్టర్లు.. చేసిన పని ..?


Published on: 01 Nov 2025 16:58  IST

నిజాంపేట్‌లోని బండారి లేఅవుట్‌లో రేష్మ క్లినిక్‌ పేరుతో వైద్యులుగా చెలామణి అవుతున్నారు రేష్మ దంపతులు. స్థానికంగా ప్రతి ఒక్కరితో ఎంతో నమ్మకంగా మెలిగారు. చిట్టీల వ్యాపారం ప్రారంభిస్తున్నట్లు చెప్పడంతో నమ్మకంతో చాలామంది చిట్టీలు వేశారు. ఒక్కొక్కరు పది లక్షల రూపాయలు చిట్టీలు కూడా వేశారు. అయితే, చిట్టీ గడువు ముగిసినా ఇవ్వకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. అనుకున్నట్లుగానే కోట్ల రూపాయల చిట్టీల డబ్బుతో భార్యాభర్తలిద్దరూ ఉడాయించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement