Breaking News

పడుకుని ఉన్న వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు

ఖమ్మం జిల్లాలో మద్యం మత్తులో పడుకుని ఉన్న ఓ వ్యక్తిపైకి కారు దూసుకెళ్లిన సంఘటన ఈ రోజు నవంబర్ 7 ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నిద్రిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.


Published on: 07 Nov 2025 12:45  IST

ఖమ్మం జిల్లాలో మద్యం మత్తులో పడుకుని ఉన్న ఓ వ్యక్తిపైకి కారు దూసుకెళ్లిన సంఘటన ఈ రోజు నవంబర్ 7 ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నిద్రిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.ఖమ్మం నగరంలోని ఎఫ్‌సీఐ బైపాస్ రోడ్డులో ఉన్న ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాల సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.రోడ్డు పక్కన విశ్రాంతి తీసుకుంటున్న ఒక వ్యక్తిని కారు ఢీకొట్టడంతో అతను మృతి చెందాడు.కారు నడుపుతున్న వ్యక్తి (నాళం సతీష్) ఇంట్లోకి వెళ్లే క్రమంలో రోడ్డుపై పడుకుని ఉన్న వ్యక్తిని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని పరిశీలించారు. ఈ  సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇది ప్రమాదమా లేక సహజ మరణమా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి