Breaking News

స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం


Published on: 17 Nov 2025 19:08  IST

తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్‌పై స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో జవాబు చెప్పాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement