Breaking News

‘ఉమ్రా’ ఘటనతో ఉలిక్కిపడిన హైదరాబాద్‌


Published on: 18 Nov 2025 10:39  IST

ఉమ్రాయాత్ర ప్రమాదం నగరాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సోమవారం తెల్లారేసరికి ప్రమాద వార్త విని నగరవాసులు ఉలిక్కిపడ్డారు. బస్సును డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టిన ఘటనలో నగరానికి చెందిన 45 మంది మరణించడంతో సిటీ జనులు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనలో విద్యానగర్‌లోని ఒకే కుటుంబానికి చెందిన 18మంది మరణించడం మరింత బాధించింది. దైవ దర్శనానికి వెళ్లిన తమ వారు మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపించారు.

Follow us on , &

ఇవీ చదవండి