Breaking News

7 నెలల గర్భిణి ప్రాణం తీశారు కదరా..!


Published on: 18 Nov 2025 11:49  IST

కాలం మారుతున్నా.. కట్న పిశాచి మారడం లేదు. తాజాగా అదనపు కట్నం కోసం మరో అబల బలైంది. వరకట్నం వేధింపులు భరించలేక ఏడు నెలల గర్భిణీ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మౌనిక మృతికి భర్త ప్రశాంత్‌, అత్త సులోచన, మామ సంపత్‌ కారణమని ఆమె తల్లి ఉమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి