Breaking News

భారతదేశం నుండి యుఎస్ వెస్ట్ కోస్ట్‌కు తొలిసారిగా జెట్ ఇంధనాన్ని ఎగుమతి చేసింది

యునైటెడ్ స్టేట్స్కు విమాన ఇంధనం ఎగుమతి చేయడం కొత్త విషయం కాదు, ఎందుకంటే US సంవత్సరాలుగా ఇతర దేశాల నుండి జెట్ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది మరియు ఎగుమతి చేస్తోంది. అయితే ,భారతదేశం  నుండి యుఎస్ వెస్ట్ కోస్ట్‌కు తొలిసారిగా జెట్ ఇంధనాన్ని ఎగుమతి చేయడం ఒక చారిత్రక ఘట్టం. ఈ ఎగుమతి నవంబర్ 17, 2025న జరిగింది. 

Published on: 18 Nov 2025 12:18  IST

యునైటెడ్ స్టేట్స్కు విమాన ఇంధనం ఎగుమతి చేయడం కొత్త విషయం కాదు, ఎందుకంటే US సంవత్సరాలుగా ఇతర దేశాల నుండి జెట్ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది మరియు ఎగుమతి చేస్తోంది. అయితే ,భారతదేశం  నుండి యుఎస్ వెస్ట్ కోస్ట్‌కు తొలిసారిగా జెట్ ఇంధనాన్ని ఎగుమతి చేయడం ఒక చారిత్రక ఘట్టం. ఈ ఎగుమతి నవంబర్ 17, 2025న జరిగింది. 

భారతదేశం(రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) షెవ్రాన్కు (అమెరికాకు చెందిన ప్రధాన ఇంధన సంస్థ) నవంబర్ 17, 2025న ఈ ఎగుమతి చేసింది.కాలిఫోర్నియాలోని షెవ్రాన్ యొక్క ఎల్ సెగుండో రిఫైనరీలో అక్టోబర్‌లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా సరఫరాలో ఏర్పడిన కొరతను తీర్చడానికి ఈ ఎగుమతి జరిగింది.సుమారు 60,000 మెట్రిక్ టన్నుల జెట్ ఇంధనం (472,800 బ్యారెళ్లు) పనామాక్స్ ట్యాంకర్ హాఫ్నియా కలంగ్‌లో లోడ్ చేయబడింది. అమెరికా గతంలో కూడా వివిధ దేశాలకు (ముఖ్యంగా లాటిన్ అమెరికా మరియు కరేబియన్ దేశాలకు) జెట్ ఇంధనాన్ని ఎగుమతి చేసింది మరియు దిగుమతి చేసుకుంది. కానీ, భారతదేశం నుండి నేరుగా USకు జెట్ ఇంధనం ఎగుమతి కావడం ఇదే తొలిసారి. 

Follow us on , &

ఇవీ చదవండి