Breaking News

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్లో ఒకరైన హిడ్మా మృతి

అత్యంత మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నాయకులలో ఒకరైన మాడ్వి హిడ్మా (Madvi Hidma) ఎన్‌కౌంటర్‌లో మరణించారు.


Published on: 18 Nov 2025 12:57  IST

అత్యంత మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నాయకులలో ఒకరైన మాడ్వి హిడ్మా (Madvi Hidma) ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయనతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు అధికారికంగా ధృవీకరించాయి. 

అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి అటవీ ప్రాంతం హిడ్మా, అతని భార్య రాజి అలియాస్ రజక్క, మరో నలుగురు మావోయిస్టులు హిడ్మా గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచారు మరియు పలు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. అతని తలపై బహుళ రాష్ట్రాల్లో కలిపి రూ. 6 కోట్ల వరకు రివార్డు ప్రకటించబడింది.ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి, ముఖ్యంగా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి (DKSZC), భారీ ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి