Breaking News

పంచాయితీ చేస్తాం.. రూ.10లక్షలు ఇవ్వండి..


Published on: 18 Nov 2025 14:46  IST

దంపతుల మధ్య సమస్య పరిష్కరించడానికి కులపెద్దలు పంచాయితీ చేస్తారట. అందుకు ఏకంగా రూ.10లక్షలు, పది తులాల బంగారం ఇవ్వాలని తీర్మాణం చేశారు. ఈ ఘటన గుంతకల్లులో వెలుగుచూసింది. బాధితురాలు తన సమస్యను చెప్పుకోవడానికి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చింది. ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. గుంతకల్లుకు చెందిన మోతికుళ్లాయమ్మ మీడియాకు సమస్య వివరించింది.

Follow us on , &

ఇవీ చదవండి