Breaking News

విభేదాల తర్వాత..తొలిసారి వైట్‌హౌస్‌కు వెళ్లిన మస్క్‌


Published on: 19 Nov 2025 17:42  IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌,టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ బిల్లు విషయంలో మిత్రులు కాస్తా శత్రువులయ్యారు.  ఈ విభేదాల నేపథ్యంలో మస్క్‌ వైట్‌హౌస్‌ ను వీడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్‌తో విభేదాల తర్వాత మస్క్‌ తొలిసారి వైట్‌హౌస్‌కు వెళ్లారు. అక్కడ విందులో పాల్గొన్నారు. మస్క్‌తోపాటూ ఈ విందులో పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో, ఎన్విదియా సీఈవో జెన్సెన్‌ హువాంగ్‌ కూడా హాజరయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి