Breaking News

దేవిమెట్ట ప్రాంతం స్క్రాప్ దుకాణంలో మంటలు

విశాఖపట్నం, మధురవాడలోని దేవిమెట్ట ప్రాంతంలో ఉన్న ఒక స్క్రాప్ దుకాణంలో ఈరోజు (నవంబర్ 20, 2025) అగ్ని ప్రమాదం సంభవించింది


Published on: 20 Nov 2025 10:28  IST

విశాఖపట్నం, మధురవాడలోని దేవిమెట్ట ప్రాంతంలో ఉన్న ఒక స్క్రాప్ దుకాణంలో ఈరోజు (నవంబర్ 20, 2025) అగ్ని ప్రమాదం సంభవించింది. 

మధురవాడ, కొమ్మాది సమీపంలోని దేవిమెట్ట ప్రాంతం స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి, అక్కడ నిల్వ ఉంచిన ప్లాస్టిక్ వస్తువులకు వేగంగా వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా అలముకుంది, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు అందుబాటులో లేవు.ఈ దుకాణాన్ని మధురవాడ ప్రియదర్శిని కాలనీకి చెందిన శామ్యూల్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి