Breaking News

7 Km పొడవుతో గాజాలో హమాస్‌ భారీ టన్నెల్‌


Published on: 21 Nov 2025 14:33  IST

హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా గాజాలో ఇజ్రాయెల్‌ భీకర దాడులు ఆగటం లేదు. హమాస్‌ అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఐడీఎఫ్‌ దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ దళాలు గాజాలో హమాస్‌కు చెందిన భారీ టన్నెల్‌ను గుర్తించాయి.సుమారు 7 కిలోమీటర్ల పొడవు, 25 మీటర్ల లోతుతో ఈ టన్నెల్‌ను నిర్మించినట్లు ఐడీఎఫ్‌ గుర్తించింది. దాదాపు 80 రూమ్‌లతో కూడిన ఈ టన్నెల్‌ వీడియోని ఇజ్రాయెల్‌ తాజాగా బయటపెట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి