Breaking News

భారత్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపు..


Published on: 21 Nov 2025 15:58  IST

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆ పార్టీ అగ్రనేత హిడ్మాతోపాటు పలువురిని పోలీసులు క్రూరంగా హత్య చేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారంటూ మావోయిస్టు పార్టీ ఆరోపించింది. అందుకు నిరసనగా నవంబర్ 23వ తేదీన భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట శుక్రవారం లేఖ విడుదల చేశారు. పోలీసుల చర్యకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి