Breaking News

APK ఫైల్‌ల పేరుతో భారీ సైబర్ స్కాం… వేలాది మంది ఫోన్లు హ్యాకర్ల చేతుల్లోకి!

APK ఫైల్‌ల పేరుతో భారీ సైబర్ స్కాం… వేలాది మంది ఫోన్లు హ్యాకర్ల చేతుల్లోకి!


Published on: 24 Nov 2025 10:57  IST

APk ఫైల్‌ల పేరుతో భారీ సైబర్ స్కాం… వేలాది మంది ఫోన్లు హ్యాకర్ల చేతుల్లోకి!

రాష్ట్రంలో మరోసారి సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారు. “మీ ఆధార్–కేవైసీ అప్‌డేట్ చేయకపోవడంతో ఈరోజు రాత్రి నుంచి మీ ఎస్‌బీఐ బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుంది. వెంటనే కింది లింక్‌ను ఓపెన్ చేసి వివరాలు అప్‌లోడ్ చేయండి” అనే పేరుతో ఆదివారం అనేక వాట్సాప్ గ్రూపుల్లో భారీగా మెసేజ్‌లు పంచుకున్నారు.

Team SBI అని అధికారికంగా కనిపించేలా పంపిన ఈ సందేశాన్ని చూసి, చాలామంది భయపడి లింక్‌పై క్లిక్ చేశారు. అదే క్షణం… వారి ఫోన్లలోకి APK ఫైల్ దూరి, మొబైల్ పూర్తిగా నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది.

తర్వాత ఆ ఫోన్‌ నుంచే మళ్లీ మరిన్ని గ్రూపులకు అదే మెసేజ్ పంపించబడింది. ఇలా చైన్ రియాక్షన్ లా వేలాది ఫోన్లకు వైరస్ చేరింది.
ఇందులో రాష్ట్ర శాఖల అధికారులు, మీడియా గ్రూపులు, విద్యార్థుల గ్రూపులు వంటి అనేక సంఘాలు ఉన్నాయి.

ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం హ్యాకర్లకు వెళ్లిపోయే ప్రమాదంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పలువురు స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించగా, కొందరు నేరుగా 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేస్తున్నారు.

APK ఫైల్ ఓపెన్ చేశారా? వెంటనే చేయాల్సిన తప్పనిసరి చర్యలు

మీరు పొరపాటున లింక్‌పై క్లిక్ చేసి, APK ఫైల్ ఇన్‌స్టాల్ అయి ఉంటే వెంటనే ఈ స్టెప్స్ ఫాలో కావాలి:

1. ఇంటర్నెట్ డేటాను వెంటనే ఆఫ్ చేయాలి

హ్యాకర్లు మరిన్ని డేటా దోచుకోకుండా మొబైల్ డేటా/వైఫై ఆఫ్చేయండి.

2. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అనుమానాస్పద యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి

Apps → Installed apps → APK / unknown app → Uninstall

3. యాంటీ వైరస్‌తో ఫోన్‌ను పూర్తి స్కాన్ చేయాలి

మాల్‌వేర్ ఇంకా దాగి ఉందేమో చెక్ అవుతుంది.

4. అన్ని పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చండి

  • బ్యాంకింగ్ యాప్‌లు

  • వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్

  • ఈ–మెయిల్ అకౌంట్లు

5. ఫోన్‌లో అనుమానాస్పద యాక్టివిటీ ఉందేమో చూసుకోండి

అనే విషయాలు చెక్ చేయాలి:

  • మెసేజ్‌లు, కాల్ లాగ్

  • బ్యాంకింగ్ లావాదేవీలు

  • ఈమెయిల్ లాగిన్ల హిస్టరీ

6. అన్‌ఇన్‌స్టాల్ అవకపోతే?

ఫోన్‌ను సేఫ్ మోడ్‌లో రీస్టార్ట్ చేసి మళ్లీ అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

7. ఇంకా సమస్యలు ఉంటే

డేటా బ్యాకప్ తీసుకొని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిది.

8. డబ్బు నష్టం జరిగిందా?

వెంటనే మీ బ్యాంకు ఖాతాను బ్లాక్ చేయించండి.
1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి.

Follow us on , &

ఇవీ చదవండి