Breaking News

నా తల్లి ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రచారం చేస్తున్నారు


Published on: 24 Nov 2025 14:41  IST

తన తల్లి చింతకుంట రత్నమ్మ ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రచారం జరుగుతోందని.. ఈ వార్తలను ఎవరూ నమ్మవద్దని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. హైటెక్ సిటీ యశోద ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీ రమేశ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. కొన్ని వార్త పత్రికల్లో, వాట్సాప్‌ గ్రూపుల్లో తన తల్లి స్వర్గస్తులు అయ్యారని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమని వాపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి