Breaking News

బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర ముంబైలోని తన నివాసంలో 89 ఏళ్ల వయసులో ఈ రోజు కన్నుమూశారు. 

బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర నవంబర్ 24, 2025న ముంబైలోని తన నివాసంలో 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు.


Published on: 24 Nov 2025 14:49  IST

బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర నవంబర్ 24, 2025న ముంబైలోని తన నివాసంలో 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. నవంబర్ ప్రారంభంలో శ్వాసకోశ సంబంధిత ఫిర్యాదుతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆయన, డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లోనే కోలుకుంటున్నారు. 

ధర్మేంద్రకు మొదటి భార్య ప్రకాష్ కౌర్, కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, కుమార్తెలు విజేత మరియు అజితతో పాటు, రెండవ భార్య హేమ మాలిని మరియు కుమార్తెలు ఈషా డియోల్, అహనా డియోల్ ఉన్నారు.

ఆరు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగిన ఆయన 300కు పైగా చిత్రాలలో నటించారు. 'షోలే', 'సీత ఔర్ గీత', 'చుప్కే చుప్కే' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి 'హీ-మ్యాన్'గా ప్రేక్షకుల మన్ననలు పొందారు.ఆయన చివరిగా 2024లో విడుదలైన 'తేరీ బాతోం మే ఐసా ఉల్జా జియా' చిత్రంలో కనిపించారు. ఆయన తదుపరి చిత్రం 'ఇక్కిస్' (Ikkis) త్వరలో విడుదల కానుంది. ఆయన మృతి తో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి