Breaking News

తల్లిదండ్రులు మందలింపు.. విద్యార్థి ఆత్మహత్య


Published on: 25 Nov 2025 11:19  IST

పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో 10వ తరగతి విద్యార్థిని శ్రీ వైష్ణవి తీవ్ర మనస్థాపానికి గురై.. ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం హైదరాబాద్‌లోని హబ్సిగూడలో జరిగింది. విద్యార్థిని ఆత్మహత్యపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శ్రీవైష్ణవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి