Breaking News

వాయుగుండం ప్రభావంతో వర్షాలు


Published on: 26 Nov 2025 12:45  IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. మలక్కా జలసంధి ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని వెల్లడించారు. అల్పపీడనం పశ్చిమ - వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఈరోజు (బుధవారం) తుఫానుగా బలపడే అవకాశం ఉందని వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి