Breaking News

మరోసారి సీఐడీ ముందుకు ధర్మారెడ్డి


Published on: 26 Nov 2025 14:44  IST

తిరుమల పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సీఐడీ పిలుపు మేరకు.. ఈరోజు (బుధవారం) విజయవాడ తులసినగర్‌లోని సీఐడీ కార్యాలయంలో ధర్మారెడ్డి విచారణకు వచ్చారు. టీటీడీ మాజీ ఈవోను సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారిస్తున్నారు.ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని మరోసారి సీఐడీ విచారణకు పిలిచింది.

Follow us on , &

ఇవీ చదవండి