Breaking News

 ఏడేళ్లబాలిక  అనుమానాస్పద స్థితిలో మృతి

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో  ఏడేళ్లబాలిక  అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈరోజు (నవంబర్ 27, 2025) ఉదయం బాలిక మృతదేహాన్ని స్థానికులు ఒక బావిలో గుర్తించారు. 

Published on: 27 Nov 2025 11:30  IST

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో  ఏడేళ్లబాలిక  అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈరోజు (నవంబర్ 27, 2025) ఉదయం బాలిక మృతదేహాన్ని స్థానికులు ఒక బావిలో గుర్తించారు. 

మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, నంబాల గ్రామం.షానిగరపు మహాన్విత (7).మహాన్విత నవంబర్ 24 నుండి కనిపించకుండా పోయింది. ఆమె ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని తల్లిదండ్రులు ఆరోపించారు. నవంబర్ 25న తప్పిపోయినట్లు ఫిర్యాదు నమోదు చేయగా, పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. బుధవారం రాత్రి వరకు ఆమె ఆచూకీ లభించలేదు. అయితే, ఈరోజు ఉదయం వారి ఇంటి దగ్గరలోని బావిలో మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు.పోలీసులు ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల కారణంగానే ఎవరో బాలికను హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి