Breaking News

పారిశ్రామికవాడల భూములపై స్కెచ్‌


Published on: 27 Nov 2025 15:06  IST

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే సీఎం రేవంత్‌రెడ్డి జీహెచ్‌ఎంసీలో శివారు మున్సిపాలిటీలను విలీనం చేయాలని చూస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ప్రజల గడప వద్దకు ప్రభుత్వం చేరాలని.. కేసీఆర్‌ పాలనను వికేంద్రీకరిస్తే.. అధికారం పేరుతో దోచుకోవడాన్నే రేవంత్‌రెడ్డి పాలసీగా ఎంచుకున్నారని నిప్పులు చెరిగారు. పారిశ్రామిక వాడలకు చెందిన భూములను అప్పనంగా తన వందిమాగదులకు కట్టబెట్టేందుకు రేవంత్‌రెడ్డి స్కెచ్‌ వేశారని ధ్వజమెత్తారు.

Follow us on , &

ఇవీ చదవండి