Breaking News

ఏపీలో 6శాతం రిజర్వేషన్లు కల్పించాలి


Published on: 01 Dec 2025 11:37  IST

ఆంధ్రప్రదేశ్‌లో విద్య, ఉపాధిలో అత్యంత వెనుకబడిన వన్నియకుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ వర్గాలకు ఆరు శాతం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ‘పాట్టాలి మక్కల్‌ కట్చి’ (పీఎంకే) ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పీఎంకే అధ్యక్షులు డాక్టర్‌ అన్బుమణి ఆదివారం చంద్రబాబుకు లేఖ రాశారు. ఏపీలో గణనీయమైన సంఖ్యలో ఉన్న వన్నియ కుల, అగ్నికుల క్షత్రియ వర్గాలకు సామాజిక న్యాయం కల్పించాల్సిన అవసరముందని ఆ లేఖలో అభిప్రాయపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి