Breaking News

తిరుపతి హోటళ్లకు బాంబు బెదిరింపు..


Published on: 01 Dec 2025 18:29  IST

తిరుపతిలోని పలు హోటళ్లకు మెయిల్స్‌ ( Mails ) ద్వారా బాంబు బెదిరింపులు (Bomb threats ) వచ్చాయి. దీంతో ఉలిక్కిపడ్డ హోటళ్ల యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. కపిలతీర్థం వద్ద ఉన్న రెండు హోటళ్లకు బెదిరింపు మెయిల్స్‌ రాగా అప్రమత్తమైన హోటళ్ల నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.బాంబు స్క్వాడ్ ( Bomb Squad ) ‌, డాగ్‌ స్క్వాడ్‌లతో హోటళ్ల వద్దకు చేరుకుని తనిఖీలు చేశారు.పోలీసులు హోటళ్లలో ఉన్న అనుమానితులను ప్రశ్నించారు. 

Follow us on , &

ఇవీ చదవండి