Breaking News

కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ఈ ప్రభుత్వ యాప్‌..


Published on: 01 Dec 2025 18:55  IST

మొబైల్‌ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా తయారయ్యే మొబైళ్లలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సైబర్‌ సెక్యూరిటీ యాప్‌ను డిఫాల్ట్‌గా అందించాలని సూచించింది. ఈ మేరకు ‘రాయిటర్స్‌’ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఇతర యాప్‌ల మాదిరిగా ఈ యాప్‌ను యూజర్లు డిలీట్‌ చేయడం కుదరదు.దేశంలో 100 కోట్లకు పైగా మొబైల్‌ వినియోగదారులు ఉన్నారు. అయితే, సైబర్‌ నేరాలు, చోరీల వంటివి తలనొప్పిగా మారాయి.

Follow us on , &

ఇవీ చదవండి