Breaking News

చండీగఢ్‌లో బూట్‌ పాలిష్‌ చేసే వికాస్‌ మాన్‌ (Vikas Maan) అనే వ్యక్తికి బాలీవుడ్‌లో పాట పాడే అవకాశం

చండీగఢ్‌లో బూట్‌ పాలిష్‌ చేసే వికాస్‌ మాన్‌ (Vikas Maan) అనే వ్యక్తికి బాలీవుడ్‌లో పాట పాడే అవకాశం లభించింది. అతనికి నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) సినిమాలో ఈ అవకాశం వచ్చింది.

Published on: 02 Dec 2025 10:16  IST

చండీగఢ్‌లో బూట్‌ పాలిష్‌ చేసే వికాస్‌ మాన్‌ (Vikas Maan) అనే వ్యక్తికి బాలీవుడ్‌లో పాట పాడే అవకాశం లభించింది. అతనికి నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) సినిమాలో ఈ అవకాశం వచ్చింది.

వికాస్ మాన్‌కు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తున్న సినిమాలో పాట పాడేందుకు ఆహ్వానం అందింది.చండీగఢ్‌లోని సెక్టార్-17లో బూట్లు పాలిష్ చేస్తూనే, అతను తన గానంతో కస్టమర్లను అలరిస్తుంటాడు. ఈ క్రమంలో ఒక వ్యక్తి అతని పాట విని, అతని వివరాలు తీసుకొని బాలీవుడ్ చిత్రంలో అవకాశం కల్పించాడు.ఈ అవకాశం కోసం వికాస్ మాన్ వచ్చే ఏడాది మార్చి నెలలో ముంబైకి వెళ్లనున్నాడు.రాజస్థాన్‌కు చెందిన వికాస్ మాన్, చిన్నప్పటి నుంచి పాటలు పాడటంపై ఆసక్తి పెంచుకున్నాడు. జీవనోపాధి కోసం చండీగఢ్‌లో బూట్ పాలిష్ చేసే పని చేస్తున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి