Breaking News

బంగాళాఖాతంలో వాయుగుండం..


Published on: 03 Dec 2025 10:56  IST

నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను వాయుగుండం బలపడి కొనసాగుతుంది. ఇది చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం బుధవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది.వాతావరణ కేంద్రం వివరించింది.

Follow us on , &

ఇవీ చదవండి