Breaking News

ఏపీలో భయపెడుతున్న కొత్త ర‌కం వ్యాధి..


Published on: 03 Dec 2025 11:10  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయపెడుతున్న కొత్త ర‌కం వ్యాధి.. పేరు స్క్రబ్ టైఫస్. ఇప్పటికే విజయనగరానికి చెందిన ఓ మహిళను ఈ మాయదారి బ్యాక్టీరియా బలి తీసుకుంది. శరీరంపై ఒకచోట దద్దుర్లొచ్చి, దానిపై నల్లటి మచ్చ ఏర్పడితే కచ్చితంగా అది స్క్రబ్ టైఫస్ లక్షణంగా భావించాలి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.వ్యాధిపై అవగాహన పెంచడమే దీనికి సరైన మార్గమని ముఖ్యమంత్రి చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి