Breaking News

అప్పుడే పుట్టిన పసికందును రోడ్డుమీద పడేస్తే..


Published on: 03 Dec 2025 14:04  IST

అప్పుడే పుట్టిన శిశువును కన్నవారు రోడ్డుపై వదిలేస్తే.. ఆ చిన్నారిని వీధి కుక్కలు కంటికి రెప్పలా కాపాడాయి. ఆ పసికందు చుట్టూ చేరి.. తెల్లవార్లూ కాపలాగా ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లా నాబద్వీప్‌లో ఈ సంఘటన జరిగింది.తెల్లవారిన తర్వాత కుక్కల మధ్యలో చిన్నారి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే ఆ పసికందును ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పసికందు పట్ల కుక్కలు వ్యవహరించి నతీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Follow us on , &

ఇవీ చదవండి