Breaking News

వీధి కుక్కల దాడి.. స్పందించిన సీఎం


Published on: 03 Dec 2025 14:37  IST

హయత్‌నగర్‌లో మూగ బాలుడు ప్రేమ్ చంద్‌పై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లోని అధికారులతో ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బాలుడి పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వారిని అదేశించారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అతడికి అవసరమైన తక్షణ సాయం అందించాలని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి