Breaking News

ఎన్నికలు బహిష్కరించిన పేరూరు గ్రామస్తులు


Published on: 03 Dec 2025 18:06  IST

నల్గొండ జిల్లా అనుమల మండలం పేరూరులో. తమ గ్రామంలో సర్పంచ్ పదవిని ఎస్టీకి రిజర్వ్ చేయడానికి నిరసనగా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు .పేరూరు గ్రామంలో ఒక్క ఓటరు కూడా ఎస్టీ లేరు. అయినప్పటికీ ఆ ఊరి సర్పంచ్ పదవిని ఎస్టీకి రిజర్వ్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించారు. సర్పంచ్‌తో పాటు వార్డు మెంబర్లు కూడా నామినేషన్లను బహిష్కరించారు. రిజర్వేషన్లు మార్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి