Breaking News

ఏపీకి మరో పిడుగులాంటి వార్త..


Published on: 04 Dec 2025 14:46  IST

నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి పశ్చిమ దిశగా కదులుతోందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇది ఈ రోజు అల్పపీడనంగా బలహీనపడుతుందని వెల్లడించింది.ఏపీలో గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి