Breaking News

హైదరాబాద్‌ వస్తోన్న విమానానికి బాంబు బెదిరింపులు


Published on: 05 Dec 2025 17:09  IST

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చే విమానాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. EK526 ఎమిరేట్స్‌ ఫ్లైట్‌ ఇవాళ ఉదయం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తోంది. ఈ క్రమంలో విమానాన్ని పేల్చేస్తామంటూ ఉదయం 7:30 గంటల సమయంలో రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన కస్టమర్‌ సపోర్ట్‌ కేంద్రానికి ఈమెయిల్‌ వచ్చింది. ఈ బెదిరింపు మెయిల్‌తో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయం 8:30 గంటల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది.

Follow us on , &

ఇవీ చదవండి