Breaking News

జూనియర్లు కొట్టడంతో సీనియర్‌ విద్యార్థి మృతి..


Published on: 08 Dec 2025 18:20  IST

జూనియర్లు కొట్టడంతో సీనియర్‌ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ నేపథ్యంలో 15 మంది జూనియర్‌ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ హోమ్‌కు తరలించారు. తమిళనాడులోని కుంభకోణం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 4న పట్టీశ్వరంలోని ప్రభుత్వ స్కూల్‌కు చెందిన 11, 12వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో 12వ తరగతికి చెందిన సీనియర్‌ విద్యార్థిపై 15 మంది జూనియర్లు దాడి చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి